గంగవరం: నా కూతురు చావుకి కారణం వాళ్లే

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, బండమీద జరావారిపల్లికి చెందిన 14 ఏళ్ల బాలిక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పద్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం, తన కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోమవారం ఇంటి దగ్గరే ఉంది. ఈ నేపథ్యంలో, నాగరాజప్ప కుటుంబీకులు తన కుమార్తెను పరుష పదజాలంతో దూషించారని, తన కుమార్తె చావుకు వారే కారణమని ఆమె ఆరోపించారు. తాము 15 సంవత్సరాల క్రితం జరావారిపల్లికి వచ్చామని, తనకు నలుగురు సంతానం అని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్