పలమనేరు మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర అవార్డు

పలమనేరు మున్సిపాలిటీ 50 వేల నుంచి లక్ష జనాభా విభాగంలో స్వచ్ఛాంధ్ర అవార్డు–2026ను గెలుచుకుంది. శుక్రవారం  విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ కె. లోకేశ్వర వర్మ ఈ అవార్డును అందుకున్నారు. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందని కమిషనర్ తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, కంపోస్టింగ్, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు అవార్డు సాధనకు దోహదపడ్డాయి.

సంబంధిత పోస్ట్

✕
✕