నగరి మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతున్న బాలిక ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాలేదని చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.