పూతలపట్టు: స్వామివారి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి

కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి సుబ్బారెడ్డి సట్టి కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్