బస్సులో సీటు కోసం బ్లేడుతో దాడి

రామసముద్రం మండలంకు చెందిన ఆదినారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంటకు వెళుతుండగా చౌడేపల్లి బస్టాండ్ లో బస్సులో సీటు కోసం సోమలకు చెందిన రాజేశ్, ఆదినారాయణ మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన రాజేష్ ఆదినారాయణ పై అమాంతంగా బ్లేడ్ తీసుకుని దాడి చేసి గాయపరిచాడు. రాజేష్ ను స్థానికులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్