పుంగనూరు పట్టణం శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వైపున శ్రీరామ్ నగర్లో తీవ్ర నీటి సమస్యతో పాటు కాల్వలు, రోడ్లు లేక సమస్యలతో సతమతమవుతున్నామని స్థానిక ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహన్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్ హామీ తెలిపారు.