సదుం: గంజాయి మత్తులో పోలీసులపై దాడి

శనివారం రాత్రి సదుం మండలంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. హర్యానాకు చెందిన ఈ వ్యక్తులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎస్సై విష్ణు నారాయణతో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై వారు దాడి చేయడంతో గాయపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్