సదుం: ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు

భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో సత్యం (35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు సదుం ఎస్సై విష్ణునారాయణ ఆదివారం తెలిపారు. సదుం మండలంలోని దిన్నెవడ్డిపల్లెకు చెందిన సత్యంకు చౌడేపల్లె మండలానికి చెందిన పల్లవితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా పల్లవి ఏడు నెలల క్రితం భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో మనోవేదనకు గురైన సత్యం బండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్