తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, మంగళవారం హైదరాబాద్‌కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 7 పరదాలు, తిరుపతికి చెందిన మణి 3 పరదాలను అమ్మవారికి సమర్పించారు. ఈ పరదాలను అమ్మవారి గర్భాలయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్ పాల్గొన్నారు.