చంద్రగిరి: ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి

చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళలను కించపరిచేలా ప్రసారాలు చేశారంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం చంద్రగిరి సీఐ సురేష్‌కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. కొటాల చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్