రామచంద్రాపురం మండల సింగిల్ విండో చైర్మన్ చేకూరి జనార్దన్ చౌదరిని ఘన సన్మానించారు. ఆదివారం రామచంద్రాపురం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కట్టకింద వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982 - 1983 పదో తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు, స్నేహితులు అందరూ కలిసి చేకూరి జనార్దన్ చౌదరిని దుశ్శాలవు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి జ్ఞాపకలను అందజేసి అభినందనలు తెలిపారు.