చంద్రగిరి: ఘాట్ రోడ్డులో కారుకు మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

బుధవారం చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో పీలేరు వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దిగి దూరంగా వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్