పాకాల మండలం కోనప్పరెడ్డిపల్లె వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న నరేష్ కుమార్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.