చంద్రగిరి: చెవిరెడ్డి, ఆయన కుమారులపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో సహా మొత్తం 41 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్‌పై విడుదలైన చెవిరెడ్డికి శనివారం సాయంత్రం వైసీపీ శ్రేణులు నాయుడుపేట–చిత్తూరు జాతీయ రహదారిపై భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి, తనపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్