చంద్రగిరి: రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు: వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట సమీపంలోని లేక్వ్యూ రిసార్ట్స్‌లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, “రాయలసీమపై చంద్రబాబు రాళ్లు వేస్తారు కానీ నీళ్లు ఇవ్వరు” అని ఆరోపించారు. జగనన్న హయాంలో 90 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును చంద్రబాబే నిలిపివేశారని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని ఆయన తెలిపారు. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్