చంద్రగిరి: కుప్పంబాదూరులో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం

రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు వడ్డీకాల్వలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ పైలట్ ప్రాజెక్టు కింద పలు జిల్లాల్లో ఈ తరహా డ్రైన్లను నిర్మిస్తున్నారు. ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా వర్షపు నీటిని వేగంగా భూగర్భంలోకి మళ్లించి, నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెంచే అవకాశాలున్నాయి. నిర్మాణంలో భాగంగా 75ఎంఎం నుంచి 12 ఎంఎం వరకు వివిధ పరిమాణాల రాళ్లను నాలుగు పొరలుగా ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్