చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి గురువారం తిరుపతికి చెందిన మణి రెండు పరదాలు, రెండు కురాళాలను విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పరదాలను వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, విజివో గిరిధర్, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.