నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలో అర్ధరాత్రి ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించింది. సుమారు 13 ఏనుగులు వరి పంటను నాశనం చేసి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది బాణసంచాలు, డప్పులతో తరిమేందుకు యత్నించినా, గున్న ఏనుగులు ఉండటంతో విఫలమయ్యారు. ఉదయం వరకు ఏనుగులు తిష్ట వేసి చివరికి అడవిలోకి వెళ్లిపోయినట్టు రైతులు తెలిపారు.