చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆలయంలో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమై, 16న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.