చంద్రగిరి: వైభవోపేతం.. శ్రీ కల్యాణ వెంకన్న పుష్పయాగం

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం పుష్ప యాగ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్యన స్వామి, అమ్మవార్ల వైభవం భక్తులకు కనువిందు చేసింది. కల్యాణ మండపంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్