చంద్రగిరి: మూడు నెలలకే దెబ్బతిన్న గ్రావెల్ రోడ్డు

యర్రావారిపాలెం మండలం నెరబైలు గ్రామ సమీపంలో ఇటీవల వేసిన గ్రావెల్ రోడ్డు మూడు నెలలకే దెబ్బతింది. రోడ్డుపై కంకర తేలిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు నాణ్యత లేకుండా చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్యపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని రోడ్డును మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్