చంద్రగిరి: మూలపల్లి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు

చంద్రగిరి మండలం మూలపల్లి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో హిటాచీ యంత్రాలతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల ద్వారా తరలిస్తున్న మట్టితో భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో పాటు గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్