చంద్రగిరి: ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఈ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో పాటు తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించి, అనంతరం ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్