ప్రభుత్వ భూమి ఆక్రమణపై మాదిగ దళ పోరాట సమితి ఆరోపణలు

చిన్నగొట్టిగల్లు మండలం రంగసానిగారిగడ్డలో సుమారు 140 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని మాదిగ దళ పోరాట సమితి ఆరోపించింది. సర్వే నంబర్లు 841, 1606, 705 పరిధిలోని భూములను కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణలపై విచారణ చేపట్టి, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, అర్హులైన ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే భూపోరాటం చేస్తామని ఎండీపీఎస్ అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్