చంద్రగిరి: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీలో బుధవారం భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సర్వీస్ లైన్ తెగి నీటిలో పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించని స్థానికుడు ఓబుల్ నాయుడు (58) నీటిలో అడుగు పెట్టడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్