చంద్రగిరి: మామిడి కొనుగోళ్లు ప్రారంభం.. టన్ను రూ. 5 వేలు

పాకాల మండలం దామలచెరువు మార్కెట్‌లో మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అధిక దిగుబడి నమోదైన నేపథ్యంలో, గుజ్జు పరిశ్రమలకు ప్రధాన ముడిసరుకైన బెంగుళూరా (తోతాపురి) కాయల కొనుగోళ్లపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత రెండు రోజులుగా పల్ప్ ఫ్యాక్టరీల ప్రతినిధులు టన్ను రూ. 5వేల చొప్పున కాయలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రైతులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ధరలు ఈ స్థాయిలో ఉండటంపై రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్