చంద్రగిరి: భారీ దొంగతనం.. నగదు, బంగారం అపహరణ

తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం సత్యసాయి నగర్‌లో గురువారం పయ్యావుల గీత నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, ఇంట్లో భద్రపరిచిన రూ. 30 వేల నగదు, 16 గ్రాముల బంగారు ఆభరణాలు, పావు కిలో వెండి వస్తువులను దొంగిలించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు.

సంబంధిత పోస్ట్