చంద్రగిరి మండలం తొండవాడ వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మినీ లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి తిరుపతికి స్టీల్ లోడ్‌తో వస్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, హైవే అంబులెన్స్ ద్వారా చంద్రగిరి సీహెచ్సీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.