చంద్రగిరి: గంగమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆరని

తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లిలో మూడేళ్లకోసారి జరిగే గంగమ్మ తల్లి జాతర సందర్భంగా గురువారం ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్డీఏ నేతలు రామకృష్ణ, బాలమురళి కృష్ణల ఆధ్వర్యంలో దర్శనం జరిగింది. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ కూడా అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగమ్మ ఆశీస్సులు శెట్టిపల్లివాసులపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్