చంద్రగిరి: ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాకాల మండలం శంఖంపల్లి పంచాయతీలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుందని, ఇది చేతల ప్రభుత్వం అని, ప్రజల కష్టాలను సీఎం బాగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మండలంలో 100% పెన్షన్ పంపిణీ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్