చంద్రగిరి: ఆగిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే నాని

చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు ఆగిపోకుండా చూస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. గురువారం తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురం నుంచి తిరుచానూరు అమ్మవారి దేవాలయానికి వెళ్లే పెద్ద చెరువు కట్టపై నిర్మిస్తున్న రోడ్డు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎమ్మెల్యే నాని చొరవతో టీటీడీ, తుడా అధికారుల సమన్వయంతో మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు పునఃప్రారంభమయ్యాయి. 15 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్