తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. భక్తులు రూ. 150 చెల్లించి పాల్గొనవచ్చు. మే 1న స్వర్ణ రథోత్సవం, మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, రాత్రి అమ్మవారి ఊరేగింపు జరుగుతాయి.