చంద్రగిరి: వృద్ధులను మోసం చేసిన మహిళపై ఆగ్రహం

రామచంద్రాపురం మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో కె. లక్ష్మి అనే మహిళ రూ. 35లక్షలు అప్పుగా తీసుకుని 15మంది వృద్ధులను మోసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ పింఛన్ డబ్బులు పొగు చేసి ఇచ్చిన వృద్ధులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. లక్ష్మి అప్పు తిరిగి ఇవ్వలేనని పోలీసుల ముందే ఆత్మహత్య చెయ్యనున్నట్టు బెదిరించింది. బాధిత వృద్ధులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్