చంద్రగిరి: రోడ్డుపై పార్టీలు, టపాసులు.. అదుపులో ఏడుగురు యువకులు

తిరుపతి రూరల్ మండలం అవిలాలలో రోడ్డు మధ్యలో పార్టీ చేసుకుంటూ టపాసులు కాల్చిన ఘటనపై పోలీసు శాఖ కఠినంగా స్పందించింది. రెండు నెలల క్రితం శానప్పకాలనీలో తులసి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు మీద పార్టీ చేసి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, సైబర్‌ క్రైం పోలీసులు ఆ వీడియో ఆధారంగా ఏడుగురిని గుర్తించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. గురువారం వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్