వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో జగన్ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించారు. పేదల కోసం జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం అన్యాయమని ఆయన విమర్శించారు.