చిన్నగొట్టిగల్లు మండలంలో మంగళవారం అటవీశాఖ అధికారులు 9 ఎర్రచందనం దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట నుంచి తలకోనకు వెళ్లే రోడ్డులోని తవ్వవాండ్లపల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద అనుమానాస్పదంగా కారును ఆపగా, అందులోని దొంగలు పరారయ్యారు. కారులో 280 కిలోల ఎర్రచందనం దుంగలు గుర్తించారు. వీటి విలువ రూ. 12 లక్షలు ఉంటుందని భాకరాపేట రేంజర్ వెంకటరమణ తెలిపారు.