తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేట గ్రామంలో తరతరాలుగా ఇనాం భూములుగా ఉన్న భూములకు హక్కు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, మండల తహశీల్దారు రామాంజులు నాయక్ శుక్రవారం భూముల సర్వేను పరిశీలించారు. మండల సర్వేయర్ హేమకుమార్ సిబ్బందితో కలిసి కొలతలు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని రైతులు తెలిపారు.