తిరుపతి రూరల్ మండలం సాయినగర్‌లోని మాతృశ్య బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. యోగా తరగతులకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన వారు తిరిగి వసతిగృహానికి చేరుకోలేదు. ఈ విషయంపై డైరెక్టర్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. బాలికలను ఎవరికైనా కనిపించిన పక్షంలో వెంటనే తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.