తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉప ఆలయమైన సూర్యనారాయణస్వామి ఆలయంలో స్వామివారికి రజత యజ్ఞోపవీతం, పంచ పాత్రలు బహుకరించారు. సుమారు రూ. 1. 60 లక్షల విలువ గల వీటిని విజయనగరానికి చెందిన ధనలక్ష్మి జ్యువెలరీస్ వారు సోమవారం సాయంత్రం సమర్పించారు. ఆలయ ఈవో దేవరాజులు, ఇన్‌చార్జ్ టీ. ప్రసాద్ సమక్షంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకుడు బాబు స్వామి వాటిని స్వామి ఆలయ అర్చకులకు అందజేశారు.