చంద్రగిరి: గంగమ్మ జాతర్లకు వెంకన్న సారె సమర్పణ

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ, చెంచువారి కాలనీలలో జరుగుతున్న గంగమ్మ జాతర్లకు తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, చంద్రగిరి నియోజక వర్గం వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పట్టువస్త్రాలు అందజేశారు. హరిపురం కాలనీలోని నడివీధి గంగమ్మకు సారెను అందజేసి పూజలు చేసిన అనంతరం, చెంచువారి కాలనీలో అమ్మవారికి సారెను అందించారు. వెంకన్న ఆలయం నుంచి వచ్చిన సారెకు గ్రామపెద్దలు, జాతర నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్