చంద్రగిరి: పాకాలలో 15 మంది వాలంటీర్లకు వైసీపీ కండువా

ఆదివారం, పాకాలలో 15 మంది వలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన‍్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నా, వైసీపీ క్యాడర్ అండగా నిలుస్తోందని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, తప్పులను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా చేరిన వలంటీర్లకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్