చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు తుంటి లీలాయాదవ్ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లీలాయాదవ్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన భార్య, ఎంపీటీసీ లక్ష్మీని ఓదార్చి ధైర్యం చెప్పి, కొద్ది దూరం పాడె కూడా మోశారు. కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు.