చిత్తూరు,: చిత్తశుద్ధితో పనిచేయాలి: ఎమ్మెల్యే

చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఎంపికైన 24 మంది అంగన్వాడి కేంద్రాల ఆయాలకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బుధవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడి ఆయాలు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చిత్తూరు అర్బన్ నుండి 11 మంది, గుడిపాల నుండి 7 మంది, చిత్తూరు రూరల్ నుండి 6 మంది చొప్పున మొత్తం 24 మంది ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్