తిరుపతి దగ్గర దామినేడులో విషాదం వెలుగుచూసింది. ఒక ఇంట్లో సోమవారం కుళ్లిపోయిన మూడు మృతదేహాలు బయటపడడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. మరణించిన వారు తమిళనాడుకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. సత్యరాజ్ పొన్నాగుట్టెతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను వదిలేసి వచ్చి ఆమె 3 ఏళ్ల కొడుకు మనీష్ తో ఇక్కడే ఉంటున్నాడు. సత్యరాజ్ ఉరేసుకోగా సమీపంలో విషం సీసా ఉండటంతో మిగతా ఇద్దరు అది తాగి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల 22 నుంచి వీరు బయట కనపడలేదు.