చంద్రగిరిలో రైస్ మిల్లర్‌పై రైతుల ఆరోపణలు

చంద్రగిరి మండలం రాయలపురం సమీపంలోని ఓ రైస్ మిల్లు యజమాని ధాన్యం మిల్లింగ్‌లో రైతులను నష్టపరుస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. జమండ్ల వీధికి చెందిన రైతు అమరనాథ్ రెడ్డి 10 బస్తాల ధాన్యాన్ని మిల్లుకు తరలించగా, కేవలం 417 కిలోల బియ్యం మాత్రమే వచ్చిందని, సాధారణంగా 470 కిలోల బియ్యం రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయమై మిల్లు యజమాని దేవాను ప్రశ్నించగా అవమానకరంగా మాట్లాడారని రైతు ఆరోపించారు. ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్