చంద్రగిరి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్‌గా గౌస్ బాష

చంద్రగిరి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్‌గా టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గౌస్ బాష నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం సాయంత్రం జీవో విడుదల చేసింది. ఈ యార్డు పరిధిలో చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాలు ఉన్నాయి. గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే పులివర్తి నాని, డైరెక్టర్లుగా జె. వినోద్ కుమార్, కామేశ్వరి, సిద్దారెడ్డి, రమణారెడ్డి, శాంతి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్