రణరంగాన్ని తలపించిన జల్లికట్టు.. యువకులకు గాయాలు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో యువకులు కోడె గుత్తలను నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి. ఈ జల్లికట్టు వేడుకల్లో పశువులను నిలువరించే సమయంలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్