రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడుపాలెం గ్రామం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెంబేడుపాళెం గ్రామానికి చెందిన మధుసూదన్ (42) నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మధుసూదన్ మృతదేహం వద్దకు చేరుకొని బోరున విలపించారు.

సంబంధిత పోస్ట్