పాకాల మండలం పెద్దరామాపురం పంచాయతీకి చెందిన వెంకట్రామపురంలో టీడీపీ కార్యకర్త ఎ. జీవానంద చౌదరి మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.