తరిగొండ వెంగమాంబ 208వ వర్థంతిని పురస్కరించుకుని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సంగీత కచేరి, సాహితీ సదస్సు నిర్వహించారు. ఆమె సహజ కవయిత్రి, యోగిని, భక్తురాలిగా తెలుగు లోకానికి చిరస్మరణీయమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారి మేడసాని మోహన్ తెలిపారు. శనివారం తిరుమల, తిరుపతి, తరిగొండలలో పుష్పాంజలి, సంగీత కచేరీలు, హరికథలు, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.